ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వచ్చిన మెసేజ్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది కూరగాయల వ్యాపారి చేసిన పని అని వెల్లడైంది. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
Canada Govt: వలసల నియంత్రణకు కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రెడీ అయింది. మరోసారి అధికారంలోకి రావాలనే టార్గెట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి సొంత పార్టీ ఎంపీలు హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబరు 28లోపు ప్రధాని పదవి నుంచి ట్రూడో తప్పుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పేర్కొన్నారు.
దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు ఉదయం వరకు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది.
PAC-SEBI: సెబీ చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్ ఈరోజు (గురువారం) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ చేసింది.
Israel Hezbollah War: ఇజ్రాయెల్, లెబనాన్ కు చెందిన హెజ్బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ క్షిపణులతో దాడి చేసింది.
Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.