PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్నసెబీ చైర్మన్ మాధబి
- నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..
- కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో విచారణ..
- ఈ మాధబిని దర్యాప్తు చేయడం రాజకీయ కుట్రగా అభివర్ణించిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAC-SEBI: సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ ఈరోజు (గురువారం) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ చేసింది. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పీఏసీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే, ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యులు ఆరోపణలు చేశారు. కాగా, పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పని తీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.
Read Also: KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఎలాంటి అవకతవకలు కనిపించలేదని పేర్కొన్నట్లు సమాచారం. సెబీ చీఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. సెబీ చీఫ్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన విచారణ ముగిసింది. అయితే, మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, సెబీచీఫ్ పదవికీ మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
కాగా, అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారిపోయింది. దీంతో సెబీ ఛైర్‌పర్సన్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని.. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం కూడా అందుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని విమర్శలు గుప్పించింది. అయితే, ఆరోపణలను మాధబి తోసిపుచ్చింది. తమ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటించారు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!