Jagga Reddy: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తిడుతున్నాడు అంటే.. మీ కథలు అట్లున్నాయి.. కాబట్టి తిడతాడని అన్నారు. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. నాజూకుగా పెరిగిన కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని సీఎం కాలేదు రేవంత్ అని చెప్పారు.
BJP New President: జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది.
Dharani Portal: ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల నిర్వహణ కోసం ఆ సంస్థతో రేవంత్ సర్కార్ ఒప్పందాన్ని చేసుకుంది.
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు (బుధవారం) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
MLC Jeevan Reddy: జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.
Haripriya Naik: రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎవరు ఇంట్రెస్ట్ చూపించనప్పటికీ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ధర్నాలో పాల్గొనడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటనకు వెళ్తుంది. సౌత్ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఈ బృందం సందర్శించనుంది.
BRICS Summit 2024: ‘బ్రిక్స్’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమానికి రష్యాలోని కజన్ వేదికగా స్టార్ట్ కానుంది.