Delhi pollution: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది.
Revanth Reddy: ప్రజాపాలన- విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు.
Maoist Party: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు అని తెలిపారు.
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు 20 లే- అవుట్లకు గాను 5000 ప్లాట్లు మురికి నీటితో నిండి పోయి ఉందన్నారు.
నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు.. ఇక, సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు.. కానీ సురేష్ కు భూమి ఉంది.. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను.. వాళ్లు పూర్తి కాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్ ల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండవద్దని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Bhatti Vikramarka: రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.. ఇక, 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది.. ఎన్నికల్లో శాసన సభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది.. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే.. యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Patnam Narender Reddy Reacts on Remand report in Lagcherla Incident: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో అరెస్ట్ చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు నా పేరుతో నిన్న బయటకు వచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు.
Eatala Rajendar: లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమంటున్నా భయపెడుతున్నారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారు.