YCP Leaders House Arrest: గుంటూరు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి.
ఫ్యూఛర్ సిటీ... దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయింది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు.
Goa Fire Accident: గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేశారు.
Kakinada: కాకినాడలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి (జీజీహెచ్) లోని స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో జీఎన్ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ధర్మ తేజ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది.
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది భవానీల సంఖ్య పెరుగుతుంది. ఇరుముడులను సమర్పించేందుకు మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ( డిసెంబర్ 11న) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలపనున్నారు.
Deputy CM Pawan: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన మాటామంత్రి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లెటూర్లు దేశానికి వెన్నుముక అందుకే పంచాయితీ రాజ్ శాఖ తీసుకున్నా.. సర్పంచ్ లే గెలిచాక మాట వినకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా వింటారు.