New York To Paris: న్యూయార్క్-పారిస్ విమానంలో ఓ మహిళ దొంగచాటుగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. స్వెట్లానా డాలి అనే రష్యా మహిళ డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో పారిస్‌కు వెళ్లేందుకు న్యూయార్క్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. అయితే, ఆమె దగ్గర బోర్డింగ్ పాస్ లేకపోవడంతో భద్రతా సిబ్బంది వెనక్కి తిప్పి పంపించారు. ఆ తర్వాత డాలి ఎయిర్ ఐరోపా సిబ్బందితో మాటలు కలిపి మరో రూట్లో పారిస్‌కు వెళ్లే విమానం ఎక్కారు. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆమె దొంచాటుగా విమానంలో ప్రయాణిస్తున్నట్లు సిబ్బంది కనిపెట్టారు. వారు పారిస్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానం అక్కడికి చేరుకోగానే అధికారులు రష్యా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Bitcoin : కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. 24గంటల్లో రూ.10లక్షలు నష్టం
అయితే, అక్రమంగా విమానంలో ప్రయాణించినందుకు గాను స్వెట్లానా డాలిపై ఎయిర్ పోర్టు అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నారు. అక్రమంగా ప్రయాణించినందున ఐదేళ్ల జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉందన్నారు. డాలి విమానం దగ్గరకు వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం భద్రతా వైఫల్యంపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, స్వెట్లానా విమానం ఎక్కిన తర్వాత తరచూ అందులోని బాత్రూంకు తిరుగడంతో.. ఆమెకు సీటు లేదనే విషయాన్ని గుర్తించలేకపోయినట్లు విమానయాన సిబ్బంది పేర్కొన్నారు.