Travis Head: రెండో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టులో బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానం కోల్పోనున్నాడని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీనికి ఆతిథ్య టీమ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రియాక్ట్ అయ్యారు. సన్నీ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జోష్ ను జట్టు నుంచి పక్కన పెట్టారన్న కామెంట్స్ చూసి షాక్ అయ్యాను అని ఆయన పేర్కొన్నారు. అయితే, గవాస్కర్ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకొంటారని సెటైర్ వేశారు. ప్రతి ఒక్కరికీ అభిప్రాయం వ్యక్తం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యాతల బృందంలో సభ్యుడు.. అలాంటి కామెంట్స్ వినోదాన్నిస్తే.. అదే కొనసాగించమనండి అని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సమావేశాలు వరుసగా వాయిదా.. ఐసీసీ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ
అయితే, ఇటీవల ఓ పత్రికకు సునీల్ గవాస్కర్ రాసిన వ్యాసంలో ఆస్ట్రేలియా టీమ్ కు భయం పట్టుకుంది.. అందుకే కొందరు సీనియర్లపై వేటు వేసిందని పేర్కొన్నారు. ఇక, తొలి టెస్ట్ మూడో రోజు హేజిల్‌వుడ్ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటర్లే ఇక ఏమైనా చేయాలన్నారు. తర్వాత ఆ టీమ్ లో విభేదాలు వచ్చాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకే అతడు సెకండ్ టెస్టు టీమ్ లో స్థానం కోల్పోయాడు. సిరీస్ మొత్తానికి అతడిని బయట ఉంచే ఛాన్స్ ఉంది. వాస్తవానికి హేజిల్‌వుడ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల్లో ఎవరికీ తప్పు కనిపించనప్పటికి.. అది మిస్టరీగానే ఉండిపోయింది. గతంలో టీమిండియా జట్టులో ఇలాగే ఉండేది. ఇప్పుడు ఆసీస్‌లో అలా జరుగుతోందని గవాస్కర్ రాసుకొచ్చారు.