Syria Crisis: సిరియాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. తిరుగుబాటుదారులు రెచ్చిపోవడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ రష్యాకు పారిపోయాడు. దీంతో ఆయన సర్కార్ కూలిపోయి.. సిరియా పూర్తిగా రెబల్స్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాలపై తాజాగా భారత విదేశాంగశాఖ రియాక్ట్ అయింది. ఆ దేశంలో మళ్లీ స్థిరత్వం రావాలని కోరుకుంది.
Read Also: R. Krishnaiah: మరోసారి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. ఈ సారి బీజేపీ నుంచి..
ఇక, సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తాము సునిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయాలన్నారు. సిరియా ప్రజల అభీష్టం మేరకు శాంతిస్థాపన జరిగేలా సమ్మిళిత రాజకీయ ప్రక్రియ ఉండాలని చెప్పుకొచ్చింది. సిరియాలో ఉన్న భారతీయుల భద్రత కోసం డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీ నిరంతరం పని చేస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Read Also: Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు.. కంపెనీ సంచలన నిర్ణయం
కాగా, సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అక్కడి ఇండియన్స్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వారందరూ సురక్షితంగా ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అన్ని వేళలా తెరిచే ఉంచినట్లు వెల్లడించింది.
Read Also: Chinmoy Krishnadas: బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్‌తో పాటు మరో 164 మందిపై దేశద్రోహం కేసు
ఇక, రెబల్స్ ఆక్రమణతో అధ్యక్షుడు అసద్ తన ఫ్యామిలితో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం మాస్కోలోనే ఉన్నారు ఆయన. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియా నుంచి వెళ్లిపోయారని రష్యా సర్కార్ పేర్కొనింది. ఇక, అసద్ పారిపోయిన తర్వాత అధ్యక్ష భవనంలోకి ప్రజలు దూసుకుపోయారు. అక్కడి ఫర్నిచర్, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిరియా అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేటు గ్యారేజీలో కోట్ల రూపాయల విలువైన పోర్ష్, లంబోర్గిని, ఫెరారీ లాంటి కార్లు ఉన్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.