Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌పై అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ విమర్శలకు బ్రిటన్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Explosion At Factory In Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి.
Supreme Court: కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పుకొచ్చింది.
Jasprit Bumrah: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట మధ్యలోనే స్టాండిన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. 31వ ఓవర్ ముగిసిన తర్వాత గాయం వల్ల అకస్మాత్తుగా గ్రౌండ్ ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.
మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. హిట్ మ్యాన్ లాంటి ప్లేయర్‌ను బెంచ్ మీద కూచోబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు.
Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. హష్ మనీ కేసులో ట్రంప్‌కు జనవరి 10వ తేదీన శిక్ష విధిస్తామని న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ మెర్చాన్ స్పష్టం చేశారు. అయితే నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే ఛాన్స్ మాత్రం లేదని సమాచారం.
Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.