Kerala High Court: మహిళల శరీరాకృతి గురించి కామెంట్లు చేసినా లైంగిక వేధింపే..
- మహిళపై లైంగిక వేధింపుల కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- అమ్మాయిల శరీరాకృతిపై తప్పుడు కామెంట్లు చేయడం లైంగిక వేధింపే: కేరళ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్స్ చేయడం వారి గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు. అది కూడా లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని పేర్కొనింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది.
Read Also: ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
అయితే, కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆ సంస్థలో పని చేసిన ఓ మహిళా స్టాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. 2013 నుంచి ఆయన తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు అభ్యంతరకర మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించింది. తన శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తనను వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కింద కేసు ఫైల్ చేశారు.
Read Also: America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిపబ్లికన్ నేత ఫైర్!
ఇక, తనపై నమోదైన ఈ కేసు కొట్టివేయాలంటూ సదరు మాజీ ఎంప్లాయి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆమెకు అందమైన శరీరం ఉందన్న ఉద్దేశంలోనే తాను అలా కామెంట్స్ చేశానూ.. దీన్ని లైంగిక వేధింపుల నేరంగా చూడొద్దని న్యాయస్థానాన్ని అతడు కోరాడు. కానీ, సదరు ఉద్యోగి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ బదరుద్దీన్ తిరస్కరించారు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!