Warangal: ప్రస్తుత కాలంలో ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. అలాంటిది తాజాగా కాకతీయ మెడికల్ కళాశాలలో జరిగిన ఓ సంఘటన మనసుకి హత్తుకుంది. ఇంతకీ ఆ సంఘటన ఎంటంటే.. తాజాగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఒక ఆవు నేలపై పడి తీవ్ర అస్వస్థతకు గురై అరుస్తుంది. అయితే, అటుగా వెళ్తున్న కొంత మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అరుపులు విని వెంటనే ఆవు వద్దకు వెళ్ళగా.. ఆ గోమాత గర్భంతో ఉన్నట్లు గమనించి వెంటనే వెటర్నరీ నిపుణుడిని వీడియో కాల్ ద్యారా సంప్రదించారు.
Read Also: Hyderabad Metro : మెట్రో స్టేషన్లలో సంక్రాంతి సంబరాలు.. డ్యాన్సులు, పాటలతో జోష్..!
ఇక, సదరు వెటర్నరీ డాక్టర్ వీడియో కాల్ లో చెప్పిన సూచనలను పాటిస్తూ గోమాతకు ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కేఎంసీ వైద్య విద్యార్థులు. కాగా, ప్రసవం తర్వాత ఆవు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గోపాలమిత్ర సభ్యులు పేర్కొన్నారు. అలాగే, సరైన సమయంలో ఆవును కాపాడిన వైద్య విద్యార్థులను స్థానికులు అభినందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది.