Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
South Korea: దక్షిణ కొరియా దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను కొరియన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విచారణ అధికారులు వెల్లడించారు.
Sri Krishna Janmabhoomi: ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఈరోజు (జనవరి 15న) విచారణ జరగనుంది.
PM Modi: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను ఈరోజు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
Congress New Office: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కొత్త భవనాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈరోజు (జనవరి 15) 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు.
Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా స్టార్ట్ అయింది. ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తాజాగా, వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ట్రై చేస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు.
బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఐదేళ్ల ముందు వరకు ఉన్న రూల్స్ మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ టూర్ కు టీమ్ వెళ్లినప్పుడు.. ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Karnataka: కర్ణాటక రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఈరోజు (జనవరి 14) ఉదయం బెళగావిలో ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది.