Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది.
Congress: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్షు పదవీపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడటం లేదు.
Global Expo 2025: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్పో” కొనసాగుతుంది.
Gaza Ceasefire-Hostage Deal: ఇజ్రాయెల్- హమాస్ల మధ్య సయోధ్య కుదిరింది. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బందీలను రిలీజ్ చేసేందుకు ఇరు వర్గాల మధ్య ఒప్పందం చివరి దశకు చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది.
H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికే హెచ్-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు.
Omar Abdullah: జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Maharashtra: మహారాష్ట్రలో పులులకు కటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించినట్లు రాష్ర్ట అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ స్పష్టం చేశారు. అయితే, పులుల మధ్య ఆవాసం, హద్దుల కోసం ఘర్షణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 పులుల చనిపోయాయని తెలిపారు.
Bhopal Accident: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది ట్రై చేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ రీల్స్ పిచ్చి వల్ల తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు.