Piduguralla: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే రెండు సార్లు కోరం లేకపోవడంతో వాయిదా పడగా.. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా టీడీపీ ప్లాన్ చేసింది.. దీంతో వైస్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇక, కౌన్సిల్లో వైసిపికి పూర్తిస్థాయి బలం.. మొత్తం 33 మంది వైసీపీ కౌన్సిలర్లే అయినా వైస్ ఛైర్మన్ పోస్టుపై తెలుగు దేశం పార్టీ కన్నేసింది. కానీ, టీడీపీ గూటికి పలువురు వైసీపీ కౌన్సిలర్లు చేరుతున్నారు. ఇప్పటికే, 17 మందికి పైగా కౌన్సిలర్లు సైకిల్ గూటికి చేరినట్లు సమాచారం.
Read Also: GBS: జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి.. స్పందించిన మంత్రి డోలా
ఇక, రహస్య ప్రాంతంలో వైసీపీ కౌన్సిలర్లతో టీడీపీ క్యాంప్ రాజకీయం నడుపుతుంది. ఎన్నిక సమయానికి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా తెలుగు దేశ పార్టీ ప్లాన్ చేసింది. మరోవైపు, తమకు టీడీపీ విధానాలు నచ్చడంతోనే ఫ్యాన్ పార్టీని వీడుతున్నామంటున్న కొందరు కౌన్సిలర్లు తెలియజేస్తున్నారు. తమ కౌన్సిలర్లను బెదిరించి, పోలీసుల అండతో దాచి పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వైస్ చైర్మన్ ఎన్నికలలో ఎలాంటి ట్విస్టులు నెలకొంటాయో అనే ఆసక్తి కొనసాగుతుంది.