Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందటం పట్ల మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Jaggareddy: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి పట్టంలోని రామ్ నగర్ కాలనీలో తన చిన్న నాటి మిత్రులతో కలిసి కాముని దహన వేడుకల్లో పాల్గొన్నారు.
Verity Festival: నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలం హున్సలో పిడిగుద్దులాట ఆగడం లేదు. హోలీ పండుగ రోజు నిర్వహించే ఆటకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. గ్రామంలోని యువకులు ఈ ఆటను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
Hit And Run Case: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. జగద్గీరిగుట్ట, షాపూర్ లలో వరుస రోడ్డు ప్రమాదాలు చేసిన కారు.. జగద్గీరి గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది.
Half day Schools: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
Crime: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో భార్య పద్మ మీద అనుమానంతో భర్త నరేంద్ర హత్య చేశాడు.
15 నిమిషాల అయినా వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారు.. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయకపోతే అవిశ్వాసం పెడతాం అని హరీష్ రావు పేర్కొన్నారు.
Telangana CM: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు
Congress: తెలంగాణ అసెంబ్లీ మాజీ మత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్ఎస్ అహంకారం ఇంకా తగ్గలేదు.. బీఆర్ఎస్ పార్టీకి దళిత స్పీకర్ పై గౌరవం లేదు అన్నారు. దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ సంభోదిస్తున్నారు.. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచంతో పిలుస్తున్నారు అని మండిపడింది.
డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది.. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం.. ఈ నెల 22వ తేదీన స్టాలిన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.