ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు.. పవన్, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటకు వస్తారు.. పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు అంటూ మండిపడింది.
బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారిని మిస్సింగ్ లెటర్ జిల్లాలో కలకలం రేపుతుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కనిపించకుండా పోయి తన తండ్రికి పంపిన లెటర్ వారిని తీవ్ర భయందోళనకు గురి చేస్తుంది.
Minister Ponguleti: యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారింది అందుకే భూ భారతి తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఇక, నలుగురు వ్యక్తులు చేసిన చట్టమే ధరణి.. ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు.
ఏపీ పాలిటిక్స్లో తాజా ట్రెండింగ్ లీడర్... వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక... కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏ2 గా కేసు ఫైల్ అయింది.
వైసీపీ పాలనలో అడ్డమైన కేసులతో అష్టకష్టాలు పడ్డామని చెబుతుంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి లీడర్స్ అండ్ కేడర్.అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్ళిన వాళ్ళు సైతం ఉన్నారని అంటారు. కానీ... ఇప్పుడు ప్రభుత్వం మారినా, మా పరిస్థితి మాత్రం మారలేదు. ఏంటీ ఖర్మ మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ బాధ అంతా ఇంతా కాదని అంటున్నారు.
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం.. వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. మినిస్టర్గా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో హవా నడిపిస్తున్నా... సొంత సెగ్మెంట్లో మాత్రం.... ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోందంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ సరికొత్త స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. ఈ ఎన్నిక ఫలితాలతో తనను తాను టెస్ట్ చేసుకోవడంతోపాటు... ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెట్టే ప్లాన్ ఉందని, అందుకే బలం లేకున్నా బరిలో నిలబడ్డట్టు కనిపిస్తోందంటున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ పొలిటీషియన్ ఆయన. గతంలో రెండు సార్లు మెదక్ ఎంపీగా చేసినప్పుడు అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవారు. పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాల జోలికి వెళ్లేవారు కాదు.