హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోందంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ సరికొత్త స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. ఈ ఎన్నిక ఫలితాలతో తనను తాను టెస్ట్ చేసుకోవడంతోపాటు... ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెట్టే ప్లాన్ ఉందని, అందుకే బలం లేకున్నా బరిలో నిలబడ్డట్టు కనిపిస్తోందంటున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ పొలిటీషియన్ ఆయన. గతంలో రెండు సార్లు మెదక్ ఎంపీగా చేసినప్పుడు అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవారు. పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాల జోలికి వెళ్లేవారు కాదు.
తెలంగాణలో మున్సిపాలిటీ పాలకమండళ్ళ పదవీకాలం ముగిసి చాలా రోజులైంది. వాటికి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు జరుగుతాయన్న క్లారిటీ లేదు. కానీ... ఇంకా పది నెలల దాకా పదవీకాలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతోంది బీఆర్ఎస్. కమాన్... మీరు రెడీ అవండి. మళ్ళీ మీకే టిక్కెట్లు ఇస్తామని గులాబీ పెద్దలు అనడం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందట.
YS Jagan: రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది.
Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Extramarital Affairs: వివాహేతర సంబంధం నేరం కాదు.. ఇది ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో సుప్రీంకోర్టూ ఇలాంటి తీర్పే ఇచ్చింది. కానీ నైతికంగా తప్పయినా నేరం కాదని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని కేసుల్లోనే ఈ తీర్పులు ఇచ్చాయి కోర్టులు.
AB Venkateswara Rao: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని కోరారు.
NEET, NEPలతో తమిళ విద్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దుతోంది.. ఇది హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషపై పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి ఒక జాతి పోరాటం.
Bihar's IIT Village: జేఈఈ మెయిన్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. ఇందులో 2,50,236 మంది కటాఫ్ స్కోర్ సాధించి.. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారు. ఈ అర్హత పొందిన వారిలో సుమారు 40 మందికి పైగా ఒకే గ్రామానికి చెందిన వారు ఉన్నారు.
Tirupati Police: తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ ( ఏప్రిల్ 21న) కీలక సూచనలు చేశారు.