MLA Sudheer Reddy: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్మూలాట కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని తేల్చి చెప్పారు. మేమంతా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేస్తున్నాం అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదనీ గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Big Shock To Maoists: ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా, మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో.. ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు... ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. వాళ్ళ పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమా హాట్ హాట్‌గా మారుతోంది. అదీకూడా.. ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ అంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది.
GHMC: మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వి కర్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు.
Traffic Restrictions: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి సక్సెస్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర రేపు హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్‌బండ్ దగ్గర ఈ యాత్ర కొనసాగనుండటంతో.. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు.
IT Company Fraud: హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు.