కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి పాకిస్తాన్ తోక వంకర చేసింది మన సైన్యం.. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నారు.
MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు.
నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
Jupally Krishna Rao: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండేది.. కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం స్థాయి నుంచి పతకాలు అందించే స్థాయికి ఎదిగారని అన్నారు.
Minister Ponnam: హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పనులపై చర్చించాం అని తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.
BRS Party: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు.
హరీష్ రావు పార్టీ పెడతారు అని ప్రచారం జరుగుతుంది.. అందుకే బుజ్జగించడానికి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లాడని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురే.. ఇప్పుడు నలుగురే అని పేర్కొన్నారు. హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి పార్టీలో ఉండాలని బ్రతిమిలాడుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
MLA Sudheer Reddy: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్మూలాట కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని తేల్చి చెప్పారు. మేమంతా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేస్తున్నాం అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదనీ గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.