TDP Mahanadu: కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.
YS Jagan: తిరుపతిలో ఇంజినీరింగ్ చదవుతున్న దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.
IAS, IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లురు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ తనపై దాడి చేశాడని టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
నేను మాటల మంత్రిని కాదు.. పనులు చేసి చూపించే మంత్రిని అని పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనలో అభివృద్ధి కుంటపడింది అని మండిపడ్డారు.
RCB Vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే.. వస్తా కూర్చో అని చెప్పి వెళ్ళిపోయినట్టు ఉందంటున్నారు. వెళ్ళిన వాడు తిరిగి రాడు.. కూర్చున్నోడు వెళ్లిపోలేడు. అదిగో ఇదిగో అనడం ఒక ఎత్తైతే.. ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ.. కొర్రీలు పెట్టుకుంటున్నారట.
గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్‌సభలో అడుగుపెట్టారీ పొలిటికల్ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్.
దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారు అని పేర్కొన్నారు. మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.