జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
YouTuber Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన కేసులో అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలను తెలిపినట్లు హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్, చైనాను సందర్శించారని వెల్లడించారు.
జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో దాదాపు ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
DC vs GT: ఐపీఎల్-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 199 రన్స్ చేసింది.
KL Rahul: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేశాడు.
RR vs PBKS: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో 8వ విజయం అందుకున్న పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో ఉంది.
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. నిన్న రాత్రి ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్న మరో ఇద్దరు కారుతో గుద్దారని తెలిపారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలు వేశాం.. మహానాడు నిర్వహణలో 13 కమిటీలు కీలకంగా వ్యవహరించబోతున్నాయి.. ఆ 13 కమిటీల సలహాలు, సూచనలను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.