Aadhaar Update: ఆధార్ లో కీలక మార్పులు దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో హోటల్, రెస్టారెంట్, అపార్ట్మెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అయ్యే ఛాన్స్ ఉంది. ఆ దిశగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా త్వరలో నూతన విధానం తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది.
Bharat Bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా రేపు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
Maoists: అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ముగిసింది. సురేష్, వాసు, అనితల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు.
Sanjay Raut: మహారాష్ట్రలో శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కూటమిలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నప్పటికీ, అది ఏమాత్రం పట్టించుకోదగిన విషయం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు (నవంబర్ 22) 'ఎక్స్' వేదికగా పోస్ట్ పెట్టారు.
Minister Srinivasa Rao: విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే మన వైపు చూస్తుంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీఐఐ సమ్మిట్ తర్వాత ఆంధ్రపదేశ్ ప్రపంచంలోనే ప్రత్యేకం గా నిలిచింది.
EV Chargers Theft: గ్రేటర్ హైదరాబాద్ లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఛార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు.
AUS vs ENG: ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. పెర్త్లో జరిగిన మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.
AP High Court: మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డి కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్లు చేసిన అభ్యర్థనపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.