Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలో అర్థ రాత్రి 2.45 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. అయితే, టెక్కలి వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
Read Also: Meena : ఏ హీరో విడాకులు తీసుకున్న నాకే లింక్ చేస్తున్నారు – మీనా ఫైర్
ఇక, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక కోటబోమ్మాళి పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన మృతదేహాలను కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్ లోని మార్చురీకి తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన నలుగురు..
1. భోరోసింగ్ పవర్
2. విజయ్ సింగ్ తోమర్
3. ఉషీర్ సింగ్
4. సంతోషి భాయ్
గాయపడిన వారు..
1. సునీల్ పటేల్
2. సంతోషి భాయ్
3.సీమన్ భాయ్
4.చీరా భాయ్
5.సావిత్రి భాయ్
6.శకుంతల భాయ్ తోమార్..