iBOMMA Ravi Father: ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న సినిమా నిర్మాత వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్‌కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు. ఐబొమ్మ రవి తండ్రి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసింది తప్పే.. అందుకు ఎలాంటి శిక్ష విధించినా ఫేస్ చేస్తాం.. కానీ, ఎన్‌కౌంటర్ చేయమని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Spirit : అధికారికంగా లాంచ్ అయిన ‘స్పిరిట్’.. క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి
అయితే, వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి జనాల మీద భారం మోపడం సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? అని ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు వ్యాఖ్యానించారు. ఇక, పోలీసుల విచారణలో ఉన్న ఇమ్మడి రవి ఇప్పటి వరకు రెండు సార్లు తనతో మాట్లాడాడని, లాయర్‌ను పెట్టేందుకు సిద్ధమని చెప్పిన మాటలను అంగీకరించలేదని అప్పారావు పేర్కొన్నారు. మరోవైపు, ఐబొమ్మ రవిని పోలీసులు నాలుగో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.