జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారత ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తుంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని ఆలోచనలో కేంద్ర హోం శాఖ ఉంది.
MR. Srinivasan: మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమీషన్ మాజీ చైర్మెన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ ఈరోజు ఉదయం తుది శ్యాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్, బ్రిటిష్- కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ యొక్క ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI)ని భారత ప్రభుత్వం రద్దు చేసింది.
Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఆయన పదవీగండం ఎదుర్కుంటున్నట్లు సమాచారం.
పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని ఈరోజు (మంగళవారం) గ్రామస్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భారత సైనిక అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ లైవ్ షెల్ ను పేల్చేశాయి.
బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.
ఇండియన్ నౌవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు దగ్గరగా వచ్చింది.. మన దేశానికి కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది.. కానీ, విక్రాంత్ పై పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసి తీవ్రంగా నష్టం కలిగించిందని అబద్దపు మాటలు చెప్పుకొచ్చారు షెహబాజ్ షరీఫ్.
India Pakistan Conflict: పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా పేర్కొన్నారు.
ముంబై ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారులలో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించినట్లుగానే.. ఇస్లామాబాద్ లోని కీలక ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీలను అప్పగించాలని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్ చేశారు.
Illicit relations: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలోని పురాన్పురా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక వివాహితతన ఇద్దరు కుమార్తెలను తనతో తీసుకెళ్లి, తన కొడుకును మాత్రం అక్కడే వదిలేసి.. తన భర్త తండ్రితో లేచిపోయింది.