Cyber Terror Activities: ప్రభుత్వ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. భారత వ్యతిరేక సందేశాన్ని పోస్ట్ చేసిన ఇద్దరు అరెస్టు
- ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్‌సైట్‌లపై సైబర్ దాడి..
- సైబర్ దాడికి పాల్పడిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్..
- గుజరాత్ కు చెందిన ఓ మైనర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏటీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Terror Activities: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల దాడి చేస్తారనే హెచ్చరికలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు వచ్చింది. దీంతో భారత వ్యతిరేక సందేశాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ ఏటీఎస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నదియాద్ కు చెందిన ఒక మైనర్ బాలుడితో పాటు జసీమ్ షానవాజ్ అన్సారీ గుర్తించారు. వీరు ఇద్దరూ టెలిగ్రామ్ ఛానెల్ నడుపుతున్నారు.. అక్కడి నుంచి వారు తమ హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారని తెలిపారు.
Read Also: Bengaluru Big Alert: బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ఈ సందర్భంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్‌సైట్‌ల హ్యాకింగ్ గురించి ఇన్‌స్పెక్టర్ డీబీ ప్రజాపతికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని అన్నారు. నిందితుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.. విచారణలో జాసిమ్ అన్సారీతో పాటు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.. వారి మొబైల్ ఫోన్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించామని చెప్పుకొచ్చారు. వీరి ఇద్దరు ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లను ఎలా హ్యాక్ చేయాలో అనేది తెలుసని దర్యాప్తులో తేలింది అన్నారు.
Read Also: CM Chandrababu: గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు..
అయితే, ఈ ఇద్దరు భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడికి ప్రయత్నించారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ DIG సునీల్ జోషి తెలిపారు. EXPLOITXSEC ఛానెల్ కోసం ELITEXPLOIT అనే బ్యాకప్ టెలిగ్రామ్ ఛానెల్‌ను సృష్టించారని, @BYTEXPOIT అనే IDని ఉపయోగించి దానిని Anonsec అని పేరు మార్చారని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా 50కి పైగ సార్లు భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలను వారి టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశారని అన్నారు.. ఇక, ఈ ఇద్దరిపై ఐటీ చట్టం సెక్షన్లు 43, 66(f) కింద కేసు నమోదు చేయబడింది. నిందితులకు ఎవరు సహాయం చేశారు, వారికి ఏదైనా ఆర్థిక సహాయం అందిందా లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. వీరి ఇరువురి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి వెల్లడించారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!