Stampede: 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్మానం కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విక్టరీ పరేడ్ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో సుమారు 11 మంది చనిపోయారు.. అలాగే, 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, గత సంవత్సరం నుంచి నేటి వరకు భారతదేశంలో ఆరు అతి పెద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Constable Chiranjeevi: కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్
ఫిబ్రవరి 2025 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..
అయితే, 2025 ఫిబ్రవరి 15వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇక, మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి ప్రయాణికులు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా 14, 15 ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించే ఫుట్-ఓవర్ బ్రిడ్జిలపై కొంతమంది ప్రయాణీకులు దిగుతున్నప్పుడు జారిపడ్డారు.. దీంతో ఒక్కరిపై మరోకరు పడిపోవడంతో ఊపిరి ఆడకపోవడంతో 18 మంది చనిపోగా.. చాలా మంది గాయపడ్డారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
జనవరి 2025 మహా కుంభమేళాలో తొక్కిసలాట..
ఇక, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. జనవరి 29వ తేదీన తెల్లవారుజామున ‘అమృత స్నాన్’కు ముందు, ‘మౌని అమావాస్య’ శుభ సందర్భంగా పవిత్ర స్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు ఒక్కసారిగా తరలి వచ్చారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: CM Siddaramaiah: ఇంత మంది వస్తారని ఊహించలేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
మే 2025 గోవా ఆలయంలో తొక్కిసలాట..
అలాగే, ఉత్తర గోవాలోని షిర్గావ్‌లో జరిగే శ్రీ దేవి లైరాయ్ వార్షిక జాతర (ఊరేగింపు) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పాటు తగినంత భద్రతా నిర్వహణ లేకపోవడం వల్ల గందరగోళం చెలరేగి.. తొక్కిసలాట జరిగింది.
Read Also: Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్ వెర్నా SX+ లాంచ్..!
జనవరి 2025 తిరుపతి ఆలయంలో తొక్కిసలాట..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గల విష్ణు నివాసంలో భక్తులకు ప్రత్యేక ‘దర్శనం’ అయిన వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. అయితే, 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన దర్శన టోకెన్లను జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి అందజేయాల్సి ఉండగా.. టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ముందు రోజు రాత్రి వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళకు సహాయం చేయడానికి ఓ గేటు తెరిచినప్పుడు.. జనం ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చారు.. దీతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.. తొక్కిసలాట చోటు చేసుకుంది.
Read Also: IPL Chairman: ఆర్సీబీ విక్టరీ పరేడ్ గురించి నాకు తెలియదు..
డిసెంబర్ 2024 సంధ్య థియేటర్లో తొక్కిసలాట..
డిసెంబర్ 4వ తేదీ 2024లో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ‘ ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా ప్రజలు తోసుకోవడంతో థియేటర్ ప్రధాన ద్వారం కూలిపోయింది. ఫ్యాన్స్ ను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా.. చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది.. అలాగే, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతున్నాడు.
Read Also: గుండె చికిత్సలో మరో మైలురాయి.. KONAR-MF డివైస్‌కు యూఎస్ పేటెంట్..!
జూలై 2024 హత్రాస్ సత్సంగ్లో తొక్కిసలాట..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో ‘భోలే బాబా’ ఆశ్వీరాదం తీసుకునేందుకు ప్రజలు ఒక్కసారిగా దూసుకు రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీని ఫలితంగా 121 మంది మరణించారు. సత్సంగ్ నిర్వాహకులు 80,000 మందితో కూడిన సమావేశానికి అనుమతి కోరినట్లు సమాచారం. అయితే, ఈ కార్యక్రమానికి సుమారు 2.5 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు అని పోలీసులు వెల్లడించారు.