New Traffic Rules: హైదరాబాద్ నగరంలో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి.. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఒక వైపు వాహనాల వేగం పెరిగింది.. 24 నుంచి 26 కిలోమీటర్లు వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయని తెలిపారు.
ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్.... వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి... అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవ్.... 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే... ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు... ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు.
పోలీసింగ్‌లో వరంగల్‌కు ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది.
Bomb Threat: హైదరాబాద్ సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు ఇవాళ (జూన్ 19న) బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్టు స్కూల్ యాజమాన్యానికి ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. హూటాహూటిన రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ స్కూల్‌కు చేరుకుని క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (జూన్ 19న) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు లాంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్‌కు సీఎం తెలియజేశారు.