Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, భద్రత, శ్రీవారి సేవలకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వైకుంట క్యూ కాంప్లెక్స్ 3 అధ్యాయనం కోసం కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పులను తీసుకొచ్చింది టీటీడీ.
Read Also: Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ హీరో అయిన 10 ఏళ్ల బాలుడు.. భారత ఆర్మీ బంపరాఫర్
అయితే, ఒంటి మిట్ట ఆలయంలో అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 4.35 కోట్లను టీటీడీ కేటాయించింది. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. వసతి గదులు పెంపు కోసం అధ్యాయనం చేయడానికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అలిపిరి నడకమార్గంలో భక్తులకు వసతి గదులు పెంపుపై అధ్యాయం చేయనున్నారు. వేద పరిరక్షణ కోసం 600 మంది వేద పండితులకు నిరుద్యోగ భృతి అందించడానికి రూ. 2.1 కోట్లు కేటాయింపుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తిరుమలలో పాత భవనాలను కూల్చి వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనంపై కమిటి పరిశీలన జరుపుతోంది.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. ఇక, టీటీడీలోని కాంట్రాక్టు డ్రైవర్లును పర్మినెంట్ చెయ్యడానికి ప్రభుత్వానికి టీటీడీ ప్రతిపాదనలు పంపించడానికి రంగం సిద్ధం చేస్తుంది.
Read Also: HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
అలాగే, తిరుమలలో ఉన్న అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. కొంత మంది వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం టీటీడీ వద్ద లేదు.. ఫిర్యాదుల ఆధారంగా, విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.