Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి సాంకేతిక, పరిపాలన వ్యవహారాల పరిశీలన కోసం 12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర జలసంఘం ప్లాన్ చేస్తుంది. అయితే, ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సభ్యులను ప్రతిపాదించే విషయమై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కమిటీలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తిలను సభ్యులుగా ఏపీ సర్కార్ ప్రతిపాదించనున్నది.
Read Also: Tripti Dimri : త్రిప్తి దిమ్రీ బోల్డ్ స్టేట్మెంట్ !
ఇక, ఈ మూడు పేర్లను ఈరోజు లేదా రేపటిలోగా కేంద్ర జలసంఘానికి పంపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం, డిజైన్, నీటి వినియోగ నిబంధనల పరంగా ఈ కమిటీ కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై త్వరలో కేంద్ర జలసంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్ట్‌పై కేంద్రం ఆసక్తి కనబరచడం పట్ల ఏపీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.