Dhruv Jurel: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ దూకుడుగా ఆడుతుంది. యువ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన సెంచరీ చేయడంతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శతకానికి చేరువలో ఉన్నాడు. వీరిద్దరూ టీమిండియా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. రెండో రోజు కొనసాగుతున్న టీమిండియా బ్యాటింగ్ లో 4 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసి, 245 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Read Also: Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ బుకింగ్స్..డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
అయితే, లంచ్ బ్రేక్ తర్వాత తొలి ఓవర్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ చేసి అవుట్ కావడంతో విండీస్ జట్టులో ఆశలు చిగురించాయి. రాహుల్ పెవిలియన్ చేరినప్పటికీ, జురెల్, జడేజా క్రీజులో నిలిచి అద్భుతమైన భాగస్వామ్యం జోడించారు. ఇక, జురెల్ తన క్లాస్ షాట్లతో ఆకట్టుకోగా.. జడ్డూ భాయ్ మాత్రం స్పిన్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ లోనే నాలుగు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. కాగా, రిషభ్ పంత్ కి గాయం కావడంతో తుద్ది జట్టులోకి వచ్చిన జురెల్ తనలోని సత్తాను చాటి శతకం బాదేశాడు.