Indus Waters Treaty: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌కు సింధూ జలాలను ఆపేస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతుంటే.. మరోవైపు తమకు నీటిని రిలీజ్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఇండియాను బతిమిలాడుతుంది. తమ దేశానికి నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని తాజాగా భారత్ ని కోరింది. […]
Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులను వివరించేందుకు డీజీపీ ఆఫీస్ కి వచ్చామని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇక, పులివెందుల ఉప ఎన్నికలో జరుగుతున్న పరిణామాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం.. అయినా స్పందన లేదు.. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మా పార్టీ వారిని భయబ్రాంతులకు గురి చేసే కుట్ర చేస్తున్నారు.
Pulivendula Election: కడప జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
S*exual harassment: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సోషల్ ఆడిట్ కోసం వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.
Rohit- Kohli: 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేయాలంటే బీసీసీఐ ఓ కండీషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం అయ్యే.. విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దరూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం పరిగణనలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది.
ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది.
HCA Corruption: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై సీఐడీకి ఫిర్యాదు అందింది. మల్టిపుల్ క్లబ్ ఓనర్షిప్ ప్రయోజనాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచారని అంబుడ్స్‌మన్, సీఐడీకి హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు.
Child Trafficking: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింది.
Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొనింది.