S*exual harassment: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సోషల్ ఆడిట్ కోసం వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిపై 25 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. తమను చెప్పరానీ చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఓ లేఖలో వివరించారు. తమతో పాటు ఇంకా చాలామంది బాధితులు ఉన్నప్పటికీ, వారు భయంతో చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.
Read Also: AlluArjun : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌ను ఆపేసిన సెక్యూరిటీ.. ఫ్యాన్స్ షాక్!
అయితే, ఆ ఉపాధ్యాయుడు గురించి కొంతమంది ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ, వారు హెచ్‌ఎంకు సమాచారం ఇచ్చిన తరువాత కూడా స్పందన రాలేదని విద్యార్థినులు తెలిపారు. ఈ సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఆడిట్ అధికారులు, విచారణకు ఆదేశాలు జారీ చేయించారు. ఎన్టీఆర్ జిల్లా డీఈవో యువి సుబ్బారావు ఆదేశాల మేరకు.. రేపు ఉదయం 11 గంటలకు చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విచారణ జరపనున్న ఉప విద్యాశాఖ అధికారి సాంబశివరావు హాజరవుతున్నారు.