Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొనింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను సైతం ఐఎండీ జారీ చేసింది. అలాగే, హైదరాబాద్‌లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Pulivendula: పులివెందులలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ- వైసీపీ మధ్య హైటెన్షన్!
ఇక, రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం వరద నీటిలో మునిగిపోయింది. అయితే, మలక్‌పేట్ బ్రిడ్జి వద్ద బురద పెరుకుపోయింది. భారీ వర్షానికి ఆరడుగుల మేర నీరు నిలిచింది. సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్‌ఘాట్, మలక్‌పేట్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్, సంతోష్ నగర్ ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. అలాగే, హైదర్‌గూడలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ నీటి మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్ లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సెల్లార్ లో పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగి పోయాయి. సెల్లార్ లో నివాసం ఉంటున్న వాచ్‌మెన్ గది పూర్తిగా నీటితో నిండిపోయింది. ఫైర్ డిపార్ట్మెంట్ కు అపార్ట్మెంట్ వాసులు సమాచారం అందించారు. సెల్లార్ లో వరద నీటిని మోటార్ సహాయంతో ఫైర్ సిబ్బంది బయటికి పంపిస్తున్నారు. 25 ఏళ్ళలో ఎప్పుడూ సెల్లార్ లోకి వరద నీరు రాలేదని వాచ్‌మెన్ కుటుంబం తెలిపింది.