ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా షూటింగ్ స్పాట్స్, స్టూడియో నిర్మాణం, రీ-రికార్డింగ్ స్టూడియోల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మరియు నంది అవార్డ్స్ వంటి ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సినీ […]
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు 14 మంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్‌కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల […]
ఒకపక్క బడా నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అవుతుంటే, మరొక పక్క టాలీవుడ్‌కు చెందిన వర్ధమాన నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారంతా మీడియాతో మాట్లాడతారని సమాచారం వచ్చింది. సరిగ్గా 2 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ సమావేశంలో వర్ధమాన నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, భైరవకోన నిర్మాత రాజేష్ దండ, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య చైతన్య, చాయ్ బిస్కెట్ సంస్థ […]
జీ తెలుగు సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*. మొట్టమొదటిసారి నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్ట్లుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలవనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్ట్‌గా *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*, ఆగస్టు 17 ఆదివారం […]
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో నిర్మాతల మండలి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో వేతన పెంపుపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పలు ఆంక్షలతో కూడిన కీలక నిర్ణయాలను ప్రకటించారు. వేతన పెంపు వివరాలు నిర్మాతల మండలి ప్రకటించిన నిర్ణయం ప్రకారం, రోజుకు 2000 రూపాయలు […]
మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించాలి. నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. Also Read:Srinu Vaitla : […]
హీరోలే లేకుండా చేసిన మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా 150 కోట్లు కలెక్షన్స్ మార్క్‌ను క్రాస్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఆయన భార్య శిల్పా ధావన్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని హోంబాలె ఫిలిమ్స్‌కు చూపించడంతో హోంబాలె ఫిలిమ్స్ దానిని సమర్పించేందుకు ముందుకు వచ్చారు. Also Read : Chiranjeevi: చిరంజీవితో ఫెడరేషన్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన సమ్మె కారణంగా టాలీవుడ్ షూటింగ్స్ పూర్తిగా స్తంభించాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసి, ఫెడరేషన్ యూనియన్లతో సంప్రదింపులు నిషేధించింది. ఈ రోజు ఉదయం ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులు సమావేశమై, సమ్మె కొనసాగింపుపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్ ఛాంబర్లో […]
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్,నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్న ‘వార్ 2’ చిత్రంలోని ‘ఆవన్ జావన్’ పాటలో కియారా అద్వానీ బికినీ సీన్‌కు సెన్సార్ బోర్డ్ కత్తెర విధించింది. ఒక రకంగా ఆమె అభిమానులకు ఇది షాక్ అనే చెప్పాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఆదేశాల మేరకు 9 సెకన్ల ‘సెన్సువల్ విజువల్స్’ను 50% తగ్గించాలని చిత్ర బృందాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ సీన్లు […]
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, NDAలో కీలక నాయకుడిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఆయన తన కమిట్మెంట్స్ కారణంగా నట జీవితాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీసు అధికారిగా నటిస్తున్నారు, శ్రీ లీల, రాశి ఖన్నా కథానాయికలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలకు […]