‘ది 100’ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికుల దుర్భరమైన జీవితాలు, వారి కష్టాలను తెరపై ఆవిష్కరించేందుకు ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ‘జార్జి రెడ్డి’ చిత్రంతో మేకర్‌గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.
Also Read : Hebba Patel : హెబ్బా పటేల్ ఏంటి ఇలా తయారైయింది!
సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతదేశ సినీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మైనింగ్ ప్రాంతాల కఠినమైన వాతావరణం, కార్మికుల దినచర్య, వారి త్యాగాలు వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ మూవీలో హీరోగా సాగర్ నటించనున్నారు. ముఖ్య పాత్రలో ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నారని సమాచారం. ఈ స్పెషల్ కారెక్టర్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకోనున్నారు. స్వతహాగా సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన సాగర్.. తాను చూసిన జీవితాల్ని, పాత్రల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు శ్రమిస్తున్నారు. వంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా టీం ప్రకటించింది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేయనున్నారు.