IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మూడో రోజున విజయం సాధించింది. కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించి భారత్‌ను విజయ పంథాలో నడిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా నాలుగు వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read : Enquiry: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
ఇక రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుండి ఢిల్లీలో జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ తో రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో సిక్సర్ల పరంగా ఏకంగా మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించాడు. జడేజా తన మొత్తం సిక్సర్ల సంఖ్యను 79కి పెంచుకోగా ధోని 78 సిక్సర్లు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒక భారతీయుడు అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును వీరేంద్ర సెహ్వాగ్ కలిగి ఉన్నాడు. సెహ్వాగ్ 91 సిక్సర్లు కొట్టాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 90 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 88 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక మరోపక్క కెఎల్ రాహుల్ 9 సంవత్సరాల తర్వాత భారతదేశంలో టెస్ట్ సెంచరీ సాధించాడు. మొదటి రోజు హాఫ్ సెంచరీతో తిరిగి వచ్చిన కెఎల్ రాహుల్ రెండవ రోజు సెంచరీ సాధించాడు. కెఎల్ రాహుల్ తన 11వ టెస్ట్ సెంచరీని సాధించి వెస్టిండీస్‌పై భారత జట్టుకు పట్టు దొరికేలా చేశాడు.
- Tags
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!