సంక్రాంతి పండుగ అంటే వివిధ రకాల జానర్లలో సినిమాలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ 2026 సంక్రాంతి మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతోంది. పండక్కి రాబోయే సినిమాలు అన్నీ కూడా ఒకే జానర్‌కు సిండికేట్ అయిపోయాయా అన్నంతగా కనిపిస్తున్నాయి. ఎవర్ని పలకరించినా “నవ్విస్తాం” అనే మాట వినిపిస్తోంది. కథలు వేరైనా, అన్ని సినిమాల కాన్సెప్ట్ మాత్రం ఎంటర్టైన్మెంటే. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు స్ట్రైట్ సినిమాలు విడుదల కాబోతుంటే, అన్నీ కామెడీ జానర్‌కు సంబంధించినవే కావడం సినీ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి రూట్ మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటేశ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ టైటిల్‌ను ఎంచుకున్నప్పటికీ, విడుదలైన లోగో (టైటిల్ డిజైన్) మాత్రం ఫ్యామిలీలో దాగిన వైలెన్స్‌ను సూచిస్తోంది. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు చిరునామా అయిన వెంకటేష్‌తో, త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారనే ప్రశ్న ఈ లోగోతో మొదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్‌కు అనుబంధంగా లోగోలో కనిపించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ అనే […]
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం విడుదల విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా, ఏకంగా వేసవి 2026కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది, సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం. భారీ బడ్జెట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చని భావిస్తున్నారు. Also Read […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కానుంది. అయితే, మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించాల్సి ఉండగా, ఈ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ […]
అనేక వాయిదాల అనంతరం రేపు విడుదల కావాల్సిన ‘అఖండ 2’ చిత్రం, ప్రీమియర్స్ నిర్వహణకు మరికొద్ది గంటల సమయం ఉండగా, ఊహించని షాక్‌ను ఎదుర్కొంది. సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ రోజు (తేదీ) తెలంగాణ హైకోర్టులో ‘అఖండ 2’ సినిమా ప్రత్యేక ప్రదర్శనల నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలను పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. పాదూరి […]
బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్యా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’ నుంచి తాజాగా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో, సినీ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద హర్ష వర్దన్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో దివిని ఓ శక్తివంతమైన […]
డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, డా. హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘నా తెలుగోడు’. సమాజానికి ఉపయోగపడే సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విడుదల సందర్భంగా చిత్ర బృందం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. హీరోగా, దర్శక నిర్మాతగా హరనాథ్ పోలిచర్ల నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వహాబ్, తనికెళ్ళ భరణి, రఘు బాబు వంటి ప్రముఖులు, అలాగే నైరా […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన ‘అఖండ-2’ సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మెమో (సంఖ్య: 6593-P/General.A1/2025; తేది: […]
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుండి రెండవ పాట విడుదలైంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘బెల్లా బెల్లా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా, మేకర్స్ రెండవ పాట ‘అద్దం […]
‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆచరణలో ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో ఇది అసాధ్యంగా మారుతోంది. పెళ్లి బంధం ఒకటి, రెండేళ్ల పంటగా మారిపోతున్న సందర్భాలు అనేకం. అయితే, ఇప్పుడు పెళ్లి సంగతి తర్వాత… నిశ్చితార్థం అయిన నెలలకే బ్రేకప్‌లు చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. నిశ్చితార్థం జరిగి, పెళ్లికి ముందే విడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కొందరు సెలబ్రిటీలు తాము విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తుంటే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు […]