Hansi Productions: హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రారంభం
ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ముహూర్తపు షాట్ కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు.
ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా నిర్మిస్తున్నాం. మా మొదటి ప్రాజెక్ట్ ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!