పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి టాప్ హీరోయిన్ శ్రీ లీల ఆడి పాడింది. నిజానికి ఈ సాంగ్ మొదట ఓ బాలీవుడ్ హీరోయిన్ తో చేయించాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో శ్రీ లీల ఎంట్రీ ఇచ్చింది. అటు అల్లు అర్జున్ మంచి డాన్సర్ ఇటు శ్రీ లీల కూడా అదిరిపోయే గ్రేస్ ఉన్న డాన్సర్. […]
విశాల్ హీరోగా వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మద గజ రాజా. కామెడీ సినిమాలతో పాటు హారర్ సినిమాలు బాగా చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం రూపొందింది. అయితే అనేక కారణాలతో ఈ సినిమా అప్పుడు విడుదలకు నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో రిలీజ్ చేస్తే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. […]
ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం పొందిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణని ‘అఖండ 2: తాండవం’ మూవీ టీం సెట్ లో సన్మానించింది. పద్మభూషణ్ పురస్కారం పొందిన తర్వాత ఈ రోజు బాలయ్య షూటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బాలయ్య ను ఘనంగా సన్మానించారు. కేక్ ని కట్ చేసి తమ అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. Pawan […]
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు మూవీ ప్రీ రిలీజ్‌ను నిర్వహించారు. ఈ […]
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5, 2024న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ ఇనిమ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయలను వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు పుష్ప 2 OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన రీలోడెడ్ ఎడిషన్‌లో 20 నిమిషాల ఫుటేజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ […]
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ […]
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముంబైలో దాడికి గతంలో అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుడు ఉపయోగించిన సిమ్ మహిళ పేరు మీద నమోదైందని విచారణలో తేలిందని అందుకే ఆమెను అరెస్ట్ చేశారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించి మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెను ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తీసుకురావచ్చు, తద్వారా తదుపరి విచారణ చేయవచ్చని అంటున్నారు. […]
శాండల్‌వుడ్ స్టార్ జంట హరిప్రియ, వశిష్ఠసింహ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. నిన్న (జనవరి 26) మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట షేర్ చేసింది. వివాహ వార్షికోత్సవం రోజున బాబు పుట్టడంతో ఈ జంట మూడు సింహాలతో ఉన్న పిక్ షేర్ చేశారు. హరిప్రియ కొన్ని తెలుగు, తమిళ సినిమాలు కూడా చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందుతున్న హరిప్రియ తెలుగు, తుళు భాషల్లో కూడా పలు చిత్రాల్లో […]
సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ప్రతిరోజూ కొత్త షాకింగ్ అప్డేట్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం అసలు నిందితుడా కాదా అని ముంబై పోలీసులను సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌కు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్లో సైఫ్ అలీఖాన్ […]
గత పది రోజులుగా తెలుగు సినీ జర్నలిస్టులు అందరికీ ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది.. ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే తెలుగులో ఒక మంచి పేరు ఉన్న దర్శకుడు ఒక నటితో ప్రేమాయణం సాగిస్తున్నాడట. తన భార్యను మోసం చేసి మరి ప్రేమాయణం సాగిస్తూ ఉండడంతో ఆయన భార్యకు న్యాయం చేయాలంటూ ఈ మెసేజ్ గత పది రోజులుగా చిన్నాచితక తేడా లేకుండా సినిమా బీట్ చూసే జర్నలిస్టులతో పాటు డెస్క్ లో […]