అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5, 2024న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ ఇనిమ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయలను వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు పుష్ప 2 OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన రీలోడెడ్ ఎడిషన్‌లో 20 నిమిషాల ఫుటేజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా OTTలో విడుదల కానుందని సినిమాకు సంబంధించిన వార్తలు తెర మీదకు వస్తున్నాయి. పుష్ప 2 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని, జనవరి 30, 2025 నుండి స్ట్రీమింగ్ కి అంతా సిద్ధం చేశారని అంటున్నారు.
Venkatesh: ఇది కదా కిక్కంటే… వెంకీ మామ కోసం ట్రాక్టర్లు కట్టుకుని వెళ్తున్నారు!
ఈ చిత్రం 20 నిమిషాల అదనపు ఫుటేజీతో సహా పూర్తి 3 గంటల 44 నిమిషాల నిడివితో ఓటీటీలో స్ట్రీమ్ కానుందని అంటున్నారు. బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని చూడటం మిస్ అయిన అభిమానులు దాని బెటర్ వెర్షన్‌ని OTTలో చూడవచ్చు. మరి ఈ సినిమా థియేటర్ల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక అల్లు అర్జున్‌తో పాటు, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ మరియు సునీల్ సహా పలువురు నటీనటులు పుష్ప 2 ది రూల్‌లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ చిత్రం పుష్ప 2కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటి శ్రీలీల ఐటెం సాంగ్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. మరి ఈ సినిమా థియేటర్ల తర్వాత OTTలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.