విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Saif Ali Khan Case: సైఫ్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్ నిర్వహించింది. భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 276 కోట్లకు పైగా వసూలు చేసిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు ట్రాక్టర్లు కట్టుకుని మరీ వస్తున్నారు ప్రేక్షకులు. ఈ లెక్కన ఈ సినిమా మీద వారిలో ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.