శాండల్‌వుడ్ స్టార్ జంట హరిప్రియ, వశిష్ఠసింహ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. నిన్న (జనవరి 26) మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట షేర్ చేసింది. వివాహ వార్షికోత్సవం రోజున బాబు పుట్టడంతో ఈ జంట మూడు సింహాలతో ఉన్న పిక్ షేర్ చేశారు. హరిప్రియ కొన్ని తెలుగు, తమిళ సినిమాలు కూడా చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందుతున్న హరిప్రియ తెలుగు, తుళు భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆమెకు బాలకృష్ణతో చేసిన జైసింహా సినిమా తెలుగులో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఆమె వశిష్ఠ సింహ అనే కన్నడ సినీ నటుడితో ప్రేమలో పడింది. 2023వ సంవత్సరం 26వ తేదీన వీరి వివాహం మైసూరులో అంగరంగ వైభవంగా జరిగింది.
Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
నిన్న, వారి రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, హరిప్రియ అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఈ స్టార్ కపుల్ విడుదల చేయడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల, నటుడు వశిష్ట సింహా తన భార్య హరిప్రియ కోసం గ్రాండ్ బేబీ షవర్ ఫంక్షన్ కూడా జరిపారు. కన్నడలోని ప్రముఖ నటీనటులు, దర్శకులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్న నటి హరిప్రియ ఇప్పుడు ఓ బిడ్డను కనడంతో కొంత కాలం సినీ పరిశ్రమకు విరామం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వశిష్ట సింహ సినిమాల్లో నటిస్తున్నాడు. వశిష్ట కూడా తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. కేజిఎఫ్, నారప్పలో చేసిన పాత్రలు వశిష్టకి మంచి పేరు తెచ్చి పెట్టాయి.