Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది.
Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా చలిగాలులు వీచాయి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Ponnama Prabhakar: రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు.
Telangana Speaker Election: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల గడువు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
Gutha Sukender Reddy: తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను రాజ్యాంగ శాసన మండలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు.
Ponnam Prabhakar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఇచ్చిందో అదే మాదిరిగా మేము ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.