Komati Reddy: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన గొంతు నొప్పి మొదలైందని విశ్వనీయ సమాచారం. అయితే.. గొంతునొప్పి ఇటీవల తీవ్రమవడం వల్ల సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. కోమటి రెడ్డికి వైద్యలు చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులు క్లారిటీ ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం లోపల ఆయన ఆరోగ్యం పై వైద్యులు వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కోరారు. గత సోమవారం ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు.
నిన్న (మంగళవారం) ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. త్వరలో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ విషయమై చర్చిస్తానని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్‌ను కలుస్తానని మంత్రి తెలిపారు. తెలంగాణలో 340 కిలోమీటర్ల హైవేను ఆరు లైన్లుగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Wednesday Special: మార్గశిర మాస ప్రారంభ వేళ ఈ స్తోత్రాలు వింటే మీ తలరాత మారిపోతుంది