Adipurush ticket price hike in Andhra Pradesh: ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఇంకా రోజుల వ్యవధి ఉన్నా సోషల్ మీడియాలో , మీడియాలో ఈ ఆదిపురుష్ మేనియా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ సినిమాను ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేయాలని అనుకున్నా ఎందుకో చివరి నిముషంలో అయితే వెనక్కి తగ్గింది. ఇక యూవీ క్రియేషన్స్ నుంచి సుమారు 185 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దక్కించుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ ప్రకటించక ముందే థియేటర్ లో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయిస్తున్నాం అంటూ ప్రకటించి కొత్త చర్చకు దారి తీసింది.
Also Read: Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
ఇక ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఆ ప్రకటనకు అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కొందరు కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు సిద్ధమయ్యారు. అయితే నిజానికి ఏపీలో సినిమా టికెట్ రేట్లు అక్కడి ప్రభుత్వం నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. డిఫాల్ట్ గా తక్కువ రేట్లకే సినిమాలు అందిస్తామని కొంత తక్కువకే సినిమా టికెట్ల అమ్మకాలు జరిపేలా చూస్తోంది అక్కడి ప్రభుత్వం. సినిమా భారీ బడ్జెట్ అయితే ప్రభుత్వానికి తమ బడ్జెట్ వివరాలు అందిస్తే కొంత పెంచి అమ్ముకునే అవకాశాలు కల్పిస్తోంది. ఆదిపురుష్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మతలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి టికెట్ రేట్ పెంచమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
ఈ మేరకు యూవీ క్రియేషన్స్ వంశీ కృష్ణా రెడ్డి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిభొట్ల ఈరోజు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ జగన్ ను కలవనున్నారని తెలుస్తోంది. అందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరగా అది ఖరారు అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా టికెట్ రేట్ 50 రూపాయల వరకు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించామని కోరనున్నట్టు చెబుతున్నారు. మరి చూడాలి వైఎస్ జగన్ ఈ ప్రతిపాదనను ఎలా అందించబోతున్నారు అనేది.