నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు. కాగా.. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు.
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు రెండు సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2021లో ఆయన సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని శపథం చేశారు. దానిని నిలబెట్టుకుంటూ, శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడి మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో కూర్చిన చంద్రబాబు భావోద్వేగానికి గురిఅయ్యినట్టు తెలుస్తుంది . సీఎం గా చంద్రబాబు, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారు.
సీఎం చంద్రబాబు సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాఖలపై పట్టు పెంచాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం…
భారతదేశంలో ఆంధ్రరాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. సృష్టించిన సంపద ప్రతి పేదవాడికి చేరవేయాలన్న సంకల్పంకూడా అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక పై ఎన్డీయే కూటమి పేదరికం లేని దేశం తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావాలన్న స్పూర్తితో పని చేస్తుంది అన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ఇక్కడ పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. ఇకపై తిరుమల…