Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీ పండుగకు జరుగుతోంది. రెండురోజుల పాటు ప్లీనరీ అంగరంగవైభవంగా జరగనుంది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. ఈ సమావేశాలకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడుతూ.. వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా అన్నారు. వైఎస్ జగన్ మాస్ లీడర్. యువతకు రోల్ మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్ చూసుకుంటారని వైఎస్ విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటివరకూ ఆదరించారు. రాజకీయ జీవితంలో మీకు మాత్రమే నేను జవాబు చెప్పాలి.
Flipkart : తగ్గేదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో వున్నప్పుడు పులివెందుల, కడప ప్రజలు మాతో వున్నారు. ఆయన లేకపోయినా అదే ఆదరణ చూపించారు. నాలో ప్రాణం వున్నంతవరకూ కడప ప్రజలకు రుణపడి వుంటా. రాజశేఖర్ రెడ్డి మనిషి, మనిషిని ప్రేమించారు. తన మనసులో వున్న ఆలోచన అమలుచేశారు. ఆయన ఉన్నా లేకున్నా అవి కొనసాగుతున్నాయి. ఆయనంటే మీకు ఎంతో అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారి మాట ఆదరణ, ఆయన చిరునవ్వు ధైర్యాన్ని ఇస్తుంది. ఏ ఒక్క రాజకీయనేతను 13 ఏళ్ల పాటు సజీవంగా వుంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డిగారు 35 ఏళ్ళు పనిచేసిన పార్టీని వదిలేశారు. అప్పుడు ఆదరించింది, అక్కున చేర్చుకుంది మీరే అని చెబుతున్నా. జగన్ ఓదార్పుయాత్రకు వస్తే మీరే ఆయన్ని ఓదార్చారు. జగన్ కోసం వచ్చిన వారిని ఆదరించారు. మేం వున్నాం అని టీడీపీ ని ఓడించారు.షర్మిల పాదయాత్రకు పోయేటప్పుడు నాకు భయం వేసింది. ఒక బిడ్డ జైళ్ళో వుంటే.. మరో ఆడబిడ్డ రోడ్డుమీదకు వచ్చింది. ఆమె మూడువేల కిలోమీటర్లు నడిపించింది మీరే అని ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..