రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కేఆర్ఎంబి బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశాను అన్నారు. కేఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరాను. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం “జలజీవన్ పథకం” కింద భరించాలని కోరినట్లు పేర్కొన్నారు..