ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్…
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట పంచాయతీ ముగిసింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సర్దుబాటు కసరత్తు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్న విజయసాయిరెడ్డి.. ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేశారాయన. అంతేకాకుండా.. పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయసాయి రెడ్డి వారికి సూచించారు.
టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Free Insurance: ఆంధ్రప్రదేశ్‌లో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్…
Railway Minister Ashwini Vaishnaw: రైళ్లలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.. కేంద్రం.. రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు…
VijayaSaiReddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారా లోకేష్ చెబుతున్నాడని.. కానీ గతంలో టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగిందన్న విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నాడు చంద్రబాబు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వాటి కాగితం విలువ కూడా…
రాజ్యసభ ప్యానల్‌వైస్ చైర్మన్‌గా మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నియమించారు.. అయితే, 10 రోజుల క్రితం సాయిరెడ్డిని.. వైస్ చైర్మన్‌గా నియమించినా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆయన పేరు తొలగించారు. అయితే, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు.. సాయిరెడ్డితో పాటు.. పీటీ ఉషను కూడా ప్యానల్‌వైస్ చైర్మన్‌గా నియమిస్తూ.. రాజ్యసభలో ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. దీంతో.. విజయసాయి రెడ్డి, పీటీ…
VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ…
VijayaSaiReddy: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కాక రేపుతున్నాయి. కొత్త అధ్యక్షుడు ఎవరో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఇప్పటికే రాహుల్ గాంధీ పార్టీ వర్గాలకు సంకేతాలు పంపారు. అటు సోనియా గాంధీ ఆరోగ్యం దృష్ట్యా ఆమె కూడా అధ్యక్ష పదవి రేసులో లేరని తెలుస్తోంది. దీంతో ఈసారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై వైసీపీ రాజ్యసభ…